11 July, 2026 | 1:52 AM

సర్పంచులు, కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలి

11-07-2026 12:06 AM

జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ 

మహబూబ్‌నగర్ అర్బన్ జూలై 10 : తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తే సరైన గుర్తింపు వస్తుందని జిల్లా అద నపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నా రు. కలెక్టర్ కార్యాలయంలో రెండు రోజుల పాటు సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించినా  శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది.కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో శుక్రవారం రెండోవ రోజు సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.

అడ్డాకల్ , రాజాపూర్, జడ్చర్ల, చిన్న చింతకుంట, దేవరకద్ర, కోయిలకొండ, గండీడ్, మహమ్మదాబాద్ 8 మండలాలకు సంబంధించిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎం.పి.ఓ లు, ఎం.పి.డి.ఓ లు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థా నిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్  మాట్లాడుతూ గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు, కార్యదర్శులు ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు.

గ్రామాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, వర్షాకాలంలో చెత్త సేకరణ, డ్రైనేజీల నిర్వహణ సక్రమంగా చేయాలని, లేకపోతే డెంగ్యూ, డయేరియా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులు వ్యాపించే ప్రమా దం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అ న్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సిఈఓ, ఇన్చార్జి డి.పి.ఓ వెంకట్ రెడ్డి, డిఆర్డిఓ నరసింహులు, ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు.