11 July, 2026 | 1:51 AM

మార్పులకు అనుగుణంగా బోధించండి

11-07-2026 12:07 AM

జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ విజయ కుమారి 

మహబూబ్ నగర్ అర్బన్ జూలై 10 : విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడుగా అప్డేట్ కావాలని కొత్త కొత్త విషయాలను సాంకేతికతను బోధనలు బాగా చేసి విద్యార్థులకు పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేటట్లు బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఐ విజయ కుమారి అన్నారు.

శుక్రవారం ఫిజికల్ సైన్స్ శిక్షణ కేంద్రాన్ని గవర్నమెంట్ హై స్కూల్ రాంనగర్ నందు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్రం పీజీ గ్రేడింగ్ లో పది స్థానాలు ముందంజలో ఉండడం అభినందనీయం అన్నారు.  ఉపాధ్యాలోకానికి అందరికీ ఒక బూస్టింగా మారుతుందన్నారు.

శిక్షణలో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన చేస్తూ అర్థం చేసుకొని క్షేత్రస్థాయిలో అమలుపరచాలని, ఇప్పటి నుంచే నాస్ పరీక్ష ఫలితాలను విశ్లేషణ చేసుకొని విద్యార్థులందరికీ వారి తరపు సంబంధించిన కనీ సామర్ధ్యాలు వచ్చేటట్లుగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మహబూబ్ నగర్ జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో  అకాడమిక్ మానిటరింగ్ అధికారి దుంకుడు శ్రీనివాస్, కోర్సు డైరెక్టర్ అంజలీదేవి ,డిఆర్పీలు సుమన్ మహారాజ్, వెంకటస్వామి బాలరాజు, మహమ్మద్ ఆఫీజ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.