ప్రజల భద్రతే మా ధ్యేయం
ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్‌రాజేందర్ రెడ్డి
మహబూబ్‌నగర్ క్రైం జూలై 10 : ప్రజల భద్రతే మా ధ్యేయమని ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రయాణిస్తేనే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి అన్నారు. నెంబర్ ప్లేట్స్ లేని ద్విచక్ర వాహనాలను శుక్రవారం ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించు కోవడం, చైన్ స్నాచింగ్లు, ఇతర నేరాలకు పాల్పడినప్పుడు గుర్తింపు తప్పించుకునే ఉద్దేశంతో నంబర్ ప్లేట్లు లేకుండా నంబర్లను మార్పులు చేసి వాహనాలను నడుపుతున్నట్లు గుర్తిస్తున్నామని తెలిపారు. ఇటువంటి చర్యలు చట్టవిరుద్ధమని, నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పోలీస్ అధికారులు ఉన్నారు.






