రేపు సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం
వారాహి గుప్త నవరాత్రుల్లో, అష్టలక్ష్మి దేవాలయంలో 22-7-2026,బుధవారం ఉదయం 7.00 గం. ల నుండి 10.00 వరకు అన్యోన్య బ్రాహ్మణ సహాయంతో అక్షర లక్ష గాయత్రి జప యజ్ఞంలో భాగంగా "సామూహిక గాయత్రి మంత్ర జప యజ్ఞం "జరుప శివ సంకల్పమైనది.
గత 70 రోజుల నుండి దాసంజనేయ స్వామి దేవాలయం లో అన్యోన్య బ్రాహ్మణ సహాయంతో 11 లక్షల గాయత్రి జపం చేయడం అయినది. ఆగష్టు 29 గాయత్రి పాడ్యమి వరకు కనీసం 20 లక్షల జపం పూర్తి చేయాలనే ఉద్దేశం తో వివిధ దేవాలయాలలో సామూహిక జప యజ్ఞాలు నిర్వహించడం జరుగుతుంది. కావున యావన్ మంది ఉపనయనం అయిన బ్రాహ్మణులు సమయ త్యాగం చేసి అష్టలక్ష్మి దేవాలయంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి
ఆషాడ వారాహి గుప్త నవరాత్రుల్లో, అక్షర లక్ష(24లక్షలు )గాయత్రి జప యజ్ఞంలో భాగంగా సమస్త లోక శాంతి కై, అన్యోన్య బ్రాహ్మణ సహాయం తో శ్రీ అష్ట లక్ష్మి దేవాలయం వాసవి కాలనీ, కొత్తపేట లో రేపు 22-7-2026 బుధవారం ఉదయం 7.00 గం.ల నుండి 10.00 గం.ల వరకు సామూహిక లక్ష గాయత్రి జప యజ్ఞం జరుగును. కావున ఉపనయనం అయిన ప్రతీ బ్రాహ్మణుడు ఈ పవిత్ర జప యజ్ఞంలో పాల్గొని లోక శాంతికి తమ వంతు పాటుపడాలని మనవి. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు. అని వేద వాక్కు.
వినోద్ కుమార్ మహావాది. B.E.
జప యజ్ఞ సమన్వయ కర్త. & అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్ర గాయత్రి ఉపాసన సంస్థ.
9000013755






