7 March, 2026 | 1:52 PM

ఊర్కొండ నూతన ఎంపీడీఓగా సత్యగోపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

07-03-2026 12:31 PM

ఊర్కొండ మండలానికి నూతన ఎంపీడీఓగా సత్యగోపాల్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ ఎంపీడీఓగా పనిచేస్తున్న కృష్ణయ్య బదిలీపై వెల్డండకు వెళ్లారు. దీంతో ఖాళీ అయిన స్థానంలో సత్యగోపాల్ రెడ్డి నియమితులై బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.