27 August, 2026 | 3:57 AM

ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం.. 'బింటాంగ్ ఆదిపూర్ణ'తో ఘన సత్కారం

07-07-2026 12:12 PM

ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోడీ కీలక ఒప్పందాలు 

జకార్తా: ఇండోనేసియాలో ప్రధాని మోదీ(PM Narendra Modi) పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇండోనేసియాలో ఈవీఎంల అభివృద్ధికి మద్దతు భారత్ మద్దతు ఇవ్వనుంది. భారత్ నుంచి అస్త్రక్షిపణి దిగుమతి చేసుకోవాలని ఇండోనేసియా(Indonesia) నిర్ణయం తీసుకుంది. ఇండోనేషియాలో ఉక్కు, నికెల్, ఆయస్కాంతాల తయారీలో భారత్ పెట్టుబడి పెట్టనుంది. మలక్కా జలసంధి(Strait of Malacca) పరిధిలో సబాంగ్ పోర్టు సంయుక్తంగా అభివృద్ధి చేయనుంది. ఇండోనేసియాలో బ్రహ్మోస్ అభివృద్ధికి(Development of BrahMos), రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం కుదిరింది.

🏅 ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న తొలి భారత ప్రధాని.. పర్యటనలో భారీ రక్షణ ఒప్పందాలు కూడా కుదిరాయి.

ఇండోనేసియాలో ప్రధాని మోఢీకి మరో అరుదైన గౌరవం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం ఇండోనేషియా అత్యున్నత పురస్కారమైన 'బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా'(Bintang Adipurna of the Republic of Indonesia) పతకాన్ని ప్రదానం చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మోదీకి పతకాన్ని అందజేశారు. "ఈ ఉదయం, ఇండోనేషియా అత్యున్నత గౌరవం నాకు ఎంతో ఆప్యాయతతో ప్రదానం చేయబడింది. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయులకు... ఇండోనేషియా ప్రజల భావనలకు, అలాగే భారత్-ఇండోనేషియా మధ్య ఉన్న చారిత్రక, సన్నిహిత సంబంధాలకు చెందుతుంది," అని ప్రధాన మంత్రి కార్యాలయం 'X'లో పోస్ట్ చేసింది. "అధ్యక్షుడు ప్రబోవో జీ, ఇండోనేషియా ప్రభుత్వం, ఇక్కడి ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాకు చెందిన 'బింటాంగ్ ఆదిపూర్ణ' (గౌరవ పతకం) ఆ దేశంలోనే అత్యున్నత గౌరవం. ఇండోనేషియా గణతంత్రం ఐక్యత, నిరంతరత, శ్రేయస్సుకు విశేషమైన సేవలు అందించిన వ్యక్తులకు ఈ పురస్కారం ప్రదానం చేయబడుతుంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత లోతుగా మార్చడానికి, వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన తన అధికారిక పర్యటనలో భాగంగా, మంగళవారం ఇండోనేషియాలోని జకార్తాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘనమైన అధికారిక స్వాగతం లభించింది.  ప్రధానమంత్రి విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించినప్పుడు సైనిక యుద్ధ విమానాలు దానికి రక్షణగా వెళ్లాయి. అనంతరం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి, సాంప్రదాయ సాంస్కృతిక నృత్య ప్రదర్శనతో సత్కరించారు. అధ్యక్షుడు ప్రబోవో వ్యక్తిగత ఆహ్వానం మేరకు జూలై 6 నుండి 8 వరకు జరుగుతున్న ఈ అధికారిక ఇండోనేషియా పర్యటన, ఆగ్నేయాసియా దేశానికి ఆయన చేస్తున్న నాల్గవ పర్యటన కావడం విశేషం.

ప్రధాని మోదీకి ఇండోనేషియా ఏ పురస్కారం లభించింది?

ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం 'బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా' ప్రదానం చేశారు. జకార్తాలో జరిగిన కార్యక్రమంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ అవార్డును అందజేశారు. ఈ పర్యటనలో బ్రహ్మోస్, రక్షణ సహకారం, సబాంగ్ పోర్టు అభివృద్ధి, పెట్టుబడులపై కీలక ఒప్పందాలు కుదిరాయి.

FAQ's

Q1. ప్రధాని మోదీకి ఏ పురస్కారం లభించింది?

ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం 'బింటాంగ్ ఆదిపూర్ణ' లభించింది.

Q2. ఈ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేశారు?

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రధాని మోదీకి పురస్కారం అందజేశారు.

Q3. ఇండోనేషియా పర్యటనలో ఏ ఒప్పందాలు కుదిరాయి?

బ్రహ్మోస్, రక్షణ సహకారం, సబాంగ్ పోర్టు అభివృద్ధి, ఉక్కు-నికెల్ రంగాల్లో పెట్టుబడులు, ఈవీఎంల అభివృద్ధి వంటి ఒప్పందాలు కుదిరాయి.

Q4. 'బింటాంగ్ ఆదిపూర్ణ' పురస్కారం అంటే ఏమిటి?

ఇది ఇండోనేషియా గణతంత్రం అందించే అత్యున్నత పౌర గౌరవం.

Q5. ప్రధాని మోదీ ఇండోనేషియా పర్యటన ఎప్పుడు జరిగింది?

జూలై 6 నుంచి 8, 2026 వరకు అధికారిక పర్యటనలో భాగంగా మోదీ ఇండోనేషియాను సందర్శించారు.

Related Articles: