సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలి
రిటైర్డ్ డీజీపీ జే పూర్ణచంద్రరావు
ఖైరతాబాద్,మార్చి 10 (విజయక్రాంతి): లక్డీకాపూల్ మీడియా సెంటర్లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వర్ధంతి సభ ఘనంగా జరిగింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు పూలే చిత్రపటానికి నివాళుల ర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బహుజన మహిళా విద్యకు సావిత్రిబాయి పూలే వేసిన పునాది ఎంతో గొప్పదని కొనియాడారు. అనంతరం బీసీ సమాజ్ అధ్యక్షుడు, ప్రముఖ జర్నలిస్ట్ సంగెం సూర్యారావు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సామాజిక సంస్కరణల వల్లే సమాజంలో నేడు అనేక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ఆమె సమాజానికి అం దించిన సేవలు వెలకట్టలేనివని గుర్తు చేశారు. ఈ సభలో రజక సంఘం అధ్యక్షులు గోపి, బహుజన నాయకుడు రజక నారాయణ, బీఎస్పీ నాయకుడు లక్ష్మణ్, ఏపీ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ నాయి, చంద్రశేఖర్ ముదిరాజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




