11 March, 2026 | 5:40 AM

రోడ్డు ప్రమాదంలో రామారెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దుర్మరణం

11-03-2026 01:07 AM

మరో ఇద్దరికి గాయాలు... మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో ఘటన

కామారెడ్డి, మార్చి 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి మాజీ జెడ్పిటిసి, జిల్లా పరిషత్ మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాదులో నివాసం ఉంటున్న నా రెడ్డి మోహన్ రెడ్డి కామారెడ్డి కి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. నా రెడ్డి మోహన్ రెడ్డి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన వారు. రాజకీయాలకు రాకముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు.

కామారెడ్డి రియల్ ఎస్టేట్ సంఘాన్ని స్థాపించారు. వ్యవస్థాపక అధ్యక్షునిగా కొనసాగారు. ప్రస్తుతం కోంపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. మోహన్ రెడ్డి కి భార్య ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం జరిపించారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకునిగా పనిచేస్తున్న నా రెడ్డి మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం దురదృష్టకరమని రాష్ట్ర బీసీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఒక మంచి కాంగ్రెస్ నాయకుల్ని కోల్పోయామని అన్నారు.

మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డిలో కొద్ది రోజులు నివాసం ఉన్న నా రెడ్డి మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ కొంపల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయన మృతి తీరని లోటు అని పార్టీలకతీతంగా రామారెడ్డి మండల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తీవ్ర విషాదంలో ఉన్నారు.