పదవతరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ
గాంధారి, మార్చి 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయం లో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న దాదాపు వంద మంది విద్యార్థులకు మండల విద్యాశాఖాధికారి శ్రీహరి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు మంజ పెంటయ్య పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివి పదవతరగతి పరీక్షల్లో విజయం సాధించాలని సూచించారు.
కష్టపడి ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాబోయే తరానికి మంచి మార్గదర్శకులు కావాలని కేజీబీవీ ప్రత్యేక అధికారిణి శిల్ప అన్నారు. అనంతరం గండివేట్, గౌరారం ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదువుతున్న విద్యార్థులతో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సమావేశమై పరీక్షల గురించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గండివేట్, గౌరారం పాఠశాలల సిబ్బంది శశికార్, ఉమాకాంత్, రాములు, బాబు, సరోజ,సరిత పాల్గొన్నారు.




