27 February, 2026 | 11:10 PM

Breaking News

గ్రామస్థులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం

27-02-2026 08:58 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): మండలములోని బొంబాయిగూడ గ్రామములో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో “సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డిపాజిటర్ల ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ సహకారంతో జరిగిన ఈ అవగాహన శిబిరంలో గ్రామస్తులకు బ్యాంకింగ్ సేవలు, సేవింగ్స్ ప్రాముఖ్యత, డిజిటల్ లావాదేవీలు, మోసాల నివారణపై వివరంగా తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వ పథకాల లాభాలు, రుణాల వినియోగం, బీమా మరియు పింఛన్ పథకాలపై మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమములో గ్రామస్తులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.