కామారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే
అభివృద్ధికి బీజేపీ అడ్డంకి కాదు, దొంగ బిల్లులకే బీజేపీ అడ్డంకి
కామారెడ్డిలో చైర్మెన్ సార్ కాదు, చైర్ పర్సన్ మేడం
పనిముట్ల కొనుగోలులో 8 లక్షల స్కాం
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కి ఫిర్యాదు చేస్తాం
బీజేపీ కౌన్సిలర్లు
కామారెడ్డి, జూలై 24 (విజయక్రాంతి): కామారెడ్డిలో కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక్కటేనని బిజెపి కౌన్సిలర్లు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మున్సిపల్ సమావేశాన్ని బిజెపి కౌన్సిలర్ అడ్డుకోలేదని అన్నారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కౌన్సిలర్ల మధ్య పంపకాలలో భేదాలు రావడం వల్లే మున్సిపల్ సమావేశాన్ని అడ్డుకున్నారని అన్నారు.
మున్సిపల్ లో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ దృష్టికి తెచ్చామన్నారు. కాంగ్రెస్, బి ఆర్‌ఎస్ ఒక్కటే పంపకాలలో భాగంగా ఒకరు చైర్మెన్, ఇంకొకరు వైస్ చైర్మెన్ పదవులను, ఒకరు 3 కో ఆప్షన్, ఇంకొకరు ఒక కో ఆప్షన్ పదవులను తీసుకున్నారని అన్నారు, వాళ్ళకి పంపకాలలో ఇబ్బందులు అయి నిన్న మున్సిపల్ సమావేశాన్ని వాయిదా వేశారు తప్ప బీజేపీ అడ్డుకోలేదని అన్నారు. అభివృద్ధికి బీజేపీ అడ్డంకి కాదు, దొంగ బిల్లులకే బీజేపీ అడ్డంకి అని అన్నారు. గత ఎజెండాలో అనేక అంశాలు అవినీతికి పాల్పడే విధంగా ఉన్నాయన్నారు.
అప్పుడు సమావేశంలో ఆమోదించనీ బిల్లులను మల్లి ఎజెండాలో పెట్టీ ఆమోదం కోసం ప్రయత్నం చేస్తే బీజేపీ అడ్డుందని అన్నారు. కామారెడ్డి లో చైర్మెన్ సార్ లేడు చైర్ పర్సన్ మేడం మాత్రమే ఉంది. ఎవరైనా డబ్బులు అడిగితే భయపడి ఇవ్వొద్దు అని ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంకు వస్తె న్యాయం చేస్తామని అన్నారు. గడువు పూర్తి అయినప్పటికీ తై బజార్ పేరిట ఇష్టం ఉన్నట్టు వసూళ్లు చేస్తున్నారు అని, వాళ్ళు వసూళ్లు మానేయాలని అన్నారు. మున్సిపల్ సిబ్బందికి పనిముట్ల కొనుగోలులో 8 లక్షలు స్కాం చేశారన్నారు. బిల్లుల చెల్లింపులో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. బిజెపి కౌన్సిలర్ లు మోటూరి శ్రీకాంత్ గుప్తా, నరేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కుంట లక్ష్మారెడ్డి, బిజెపి మహిళా కౌన్సిలర్లు పాల్గొన్నారు.






