17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బడి అంటే చిన్నారులకు పండుగలా ఉండాలి

14-06-2025 12:00 AM

జయశంకర్ బడిబాట పిల్లలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన పెద్దలు 

గోపాలపేట జూన్ 13: బడి అంటే చిన్నారులకు పండుగల అనిపించి పరిగెత్తుకొని వచ్చేలా చూడాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అన్నారు. గోపాలపేట మండలం బుద్ధారం యుపిఎస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు బడి పున ప్రారంభోత్సవాన్ని పండుగలా జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకుప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా అడ్మిషన్లు కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా రెండు జతల దుస్తులు మంచి పౌష్టికరమైన ఆహారం ఆంగ్ల మాధ్యమంలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన కల్పిస్తుందని చెప్పారు.

అంతకుముందు చిన్నారులచే సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేసి నూతనంగా చేరిన విద్యార్థులకు ఆ గ్రామ పెద్దలు పాల్గొని చిన్నారుల చేత అక్షరాలను దిద్దించి సామూహిక అక్షరాభ్యాసం చేయించారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జయశ్రీ జడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం భాస్కర్ మాజీ సర్పంచ్ అచ్యుత రామారావు వెంకటయ్య బిళ్ళ కంటి రాజు మాజీ ఎంపిటిసి అరు శ్రీదేవి విష్ణు మాజీ వార్డు సభ్యులు శ్రావణ్ కుమార్ చంద్రయ్య పంచాయతీ కార్యదర్శి కాశన్న నరేందర్ కారోబార్ జగపతిరావు పాఠశాల ఉపాధ్యాయుల సిబ్బంది పారిజాత సునీత యాదమ్మ అనిత నాగలక్ష్మి కృష్ణ అంగన్వాడి టీచర్ భాగ్యలక్ష్మి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.