30 June, 2026 | 8:39 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

ట్రాక్టర్లు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

14-06-2025 12:00 AM

వేములపల్లి జూన్ 13 : రెండు ట్రాక్టర్లు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం వేములపల్లి మండలంలో ని మొల్కపట్నం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రావుల పెంట నుండి మిర్యాలగూడ వైపు ఇసుకలోడుతో అతివేగంగా వెళ్తున్న  ట్రాక్టర్, కారును తప్పించబోయి  మిర్యాలగూడ నుంచి రావులపెంట వైపు  ఇసుకను అన్లోడ్ చేసి వెళ్తున్న ట్రాక్టర్‌ను  ప్రక్కనుంచి మొల్క పట్నం గ్రామ శివారు వద్ద ఢీ కొట్టింది.

ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ పల్టీ కొట్టగా ట్రాక్టర్ డ్రైవర్ చంటి కి తీవ్ర గాయాల య్యాయి. మరొక ట్రాక్టర్ డ్రైవర్ తృటిలో తప్పించుకున్నారు. రెండు ట్రాక్టర్లు రావుల పెంట గ్రామానికి చెందినవే. స్థాని కులు 108 సహాయంతో తీవ్ర గాయాలైన చంటిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఘటనా స్థలా నికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి కేసు నమోదు చేశారు.