ఆటలతో ముగిసిన బడిబాట
వాజేడు (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చివరి రోజున ఆటలతో ముగిశాయి. మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాజేడు నాగారంలో గురువారం చివరి రోజున ఆటల పోటీలు నిర్వహించారు. పాఠశాలలో కొత్తగా నమోదైన విద్యార్థులతో పాటు అందరికీ ఖో ఖో, కబడ్డీ, త్రో బాల్ క్రీడాంశాలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు(Principal Soyam Anand Rao) మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతో పాటు వివిధ క్రీడలలో ప్రావీణ్యం సాధించాలని ఆటలు శరీర మానసిక వికాశానికి తోడ్పడతాయని అన్నారు. ప్రతిరోజు ఒక గంట ఆటలు ఆడటం వలన శరీరం, చురుకుగా ఉల్లాసంగా ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చల్లగురుగుల మల్లయ్య, వెంకటరమణ, రంగు ఆనంద్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






