6 July, 2026 | 12:59 PM

సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు

06-07-2026 12:14 PM

బోథ్, జులై 6 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని సాయి నగర్ కాలనీలో నీ మురికి కాలువ లో ముల్ల పొదలు పెరగడంతో సోమవారం కాలువలోని ముండ్ల పొదలను తొలగించారు. వర్షాకాలంలో పొదల వల్ల వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతోపాటు కాలనీలోకి వెళుతుండడంతో చెట్లను తొలగించడం జరుగుతుందని ఈవో అశోక్ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఈవో తెలిపారు గ్రామంలో ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా ఉండాలని సూచించారు