24 July, 2026 | 5:16 PM

కోనరావుపేటలో పాఠశాలల బంద్

24-07-2026 04:33 PM

ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఆందోళన

కోనరావుపేట,(విజయక్రాంతి): ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో శుక్రవారం కోనరావుపేట మండల కేంద్రంలో పాఠశాలల బంద్ నిర్వహించారు. విద్యార్థి సంఘాల పిలుపు మేరకు మండల కేంద్రంలోని పలు విద్యాసంస్థలు బంద్‌కు సహకరించి తరగతులను నిలిపివేశాయి. ఈ సందర్భంగా ఎన్ఎస్‌యూఐ నాయకులు మాట్లాడుతూ... నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడాలని, ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఈవై మండల అధ్యక్షులు రాజురి వెంకటేష్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి ప్రభాకర్, జాషువా,సన్నీ, తిరుపతి, జశ్వంత్, తదితరులు వున్నారు.