24 August, 2026 | 2:45 PM

హైస్కూల్‌కు సైన్స్ ల్యాబ్ మంజూరు

24-08-2026 12:56 PM

మల్లాపూర్, ఆగస్టు 24(విజయక్రాంతి): మండలంలోని వి.వి.రావుపేట హైస్కూల్‌కు సైన్స్ ల్యాబ్ మంజూరైంది. తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు చొరవతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటుకు ఇరవై ఆరు లక్షల నిధులు మంజూరైనట్లు వెంకట్రావుపేట సర్పంచ్ కనుముల వెంకటేష్ తెలిపారు. సైన్స్ ల్యాబ్ అందుబాటులోకి రావడంతో వెంకట్రావుపేట, వి.వి.రావుపేట గ్రామాలకు చెందిన విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య మరింత చేరువ కానుంది. పాఠ్యాంశాలను ప్రయోగాల ద్వారా అర్థం చేసుకునేందుకు విద్యార్థులకు మెరుగైన అవకాశం లభిస్తుందని ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. పాఠశాలకు సైన్స్ ల్యాబ్ మంజూరు కావడంపై వారు హర్షం వ్యక్తం చేస్తూ జువ్వాడి నర్సింగరావుకు కృతజ్ఞతలు తెలిపారు