24 August, 2026 | 3:14 PM

ప్రజావాణిలో నవజ్యోతి పాఠశాలపై ఫిర్యాదు

24-08-2026 02:03 PM

* టీసీకి అదనంగా ఫీజు చెల్లించాలని డిమాండ్ 

* పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి 

ముస్తాబాద్,ఆగస్టు 24(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం లోని నవజ్యోతి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో సేవాలాల్ తండాకు చెందిన దారంసోత్ రవి నాయక్ ఫిర్యాదు చేశారు. రవికి ఇద్దరు కుమారులు ముస్తాబాద్ లోని నవ జ్యోతి పాఠశాలలో గత సంవత్సరంలో ఒక విద్యార్థి ఐదవ తరగతి మరొక విద్యార్థి మూడవ తరగతి చదివారు. నాణ్యమైన విద్య కోసం ఈ సంవత్సరం మా కుమారులను కరీంనగర్ లో చదివిస్తున్నామని రవి పేర్కొన్నారు.

అయితే నవజ్యోతి పాఠశాలకు చెల్లించవలసి నటువంటి ఫీజులు అన్నీ కూడా చెల్లించామని వారికి ఎలాంటి బాకీ లేమన్నారు. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ)కోసం నవజ్యోతి పాఠశాలకు వెళ్లి యాజమాన్యాన్ని అడగగా అదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చెల్లించి మీ సర్టిఫికెట్లు తీసుకెళ్లండని దురుసుగా మాట్లాడినట్టు పత్రికా ప్రకటనకు తెలియజేశారు.అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలలపై మండల విద్యాధికారి చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా వెల్లడించారు.