24 August, 2026 | 3:38 PM

బస్సు ఢీకొని యువకుడు మృతి

24-08-2026 02:36 PM

పటాన్ చెరు, ఆగస్టు 24(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద ప్రైవేటు బస్సు ఢీకొని పుల్కల్ మండలానికి చెందిన ప్రశాంత్ (32) అనే యువకుడు మృతి చెందాడు. అతను ద్విచక్ర వాహనంపై పటాన్‌చెరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.పటాన్‌చెరు వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోస్టుమార్టం కోసం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పటాన్ చెరు పోలీసులు.