వృద్ధాప్య బీడీ కార్మికుల పింఛన్ అప్లికేషన్లు తీసుకోవాలి
ప్రజావాణిలో ఎంపీడీవో రాజేందర్ కు వినతి పత్రం అందజేత
గంభీరావుపేట, ఆగస్టు 24 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో వృద్ధాప్య బీడీ కార్మికుల పింఛన్ దరఖాస్తులను స్వీకరించాలని బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మండల ప్రజావాణిలో ఎంపీడీవో రాజేందర్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం స్వీకరిస్తున్న పింఛన్ దరఖాస్తుల్లో వృద్ధాప్య బీడీ కార్మికుల దరఖాస్తులను తీసుకోవడం లేదని ఆరోపించారు.
వెంటనే అట్టి దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువజన నాయకులు ఇరిగి సందీప్, చిట్టెంపల్లి బిక్షపతి, ఏగదండి అర్జున్, ఏగదండి రవి, ఎండి అస్మాత్, బండరాజు, దోశల శంకర్, పిట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.






