24 August, 2026 | 3:15 PM

గాగిల్లాపూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

24-08-2026 02:41 PM

బెజ్జంకి, ఆగస్టు 24(విజయక్రాంతి): బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఎర్రల జానకిరాజు లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు మరింత సులభంగా అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాము రాజేంద్రప్రసాద్, జీపివో శ్రీనివాస్, అంగన్‌వాడీ టీచర్ శారద, రేషన్ డీలర్ పద్మ, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.