18 April, 2026 | 11:24 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

సీట్ల సర్దుబాటు!

18-10-2025 12:00 AM

బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతున్నది. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌కు రెం డు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనున్నది. 121 స్థానాలకు నవంబర్ 6న తొలి విడత పోలింగ్, నవంబర్ 11న మరో 122 స్థానాలకు రెండో విడత పోలింగ్ జరగనున్నాయి. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో తొలి విడత ఎన్నికలకు సంబంధించి శుక్రవారం తో నామినేషన్ల ప్రక్రియకు గడువు ముగియడంతో ప్రధాన రాజకీయ పా ర్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది.

ఎన్డీయే కూటమి సీట్ల సర్దుబాటుకు సంబంధించి పూర్తి క్లారిటీతో ఉంది. బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లలో పోటీ చేయడనుండగా, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేజీ)కి 29 సీట్లు, జితన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చాకు 6 స్థానాలు, ఉపేంద్ర కుష్వా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మో ర్చా పార్టీకి 6 సీట్లు కేటాయించారు. మరోవైపు మహాఘట్‌బంధన్ కూటమిలో మాత్రం సీట్ల సర్దుబాటుకు సంబంధించిన పంచాయితీ ఇంకా తెగ లేదు.

సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య తీవ్ర చర్చలు జరిగాయి. తొ లుత ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. కాంగ్రెస్ 61 స్థానాల్లో, కూటమిలో భాగమైన ముకేష్ సాన్హీ వికాస్ షీల్ ఇన్‌సాన్ పార్టీ (వీఐపీ)కి 16, వామపక్ష కూటమికి 29 నుంచి 31 సీట్లు కేటాయించాలనుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల తమకు 70 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.

కానీ ఆర్జేడీ మాత్రం కాంగ్రెస్‌కు 55 నుంచి 60 సీట్లు మాత్రమే ఇవ్వాలని భావిస్తుంది. ఇటీవల జార్ఖండ్ ముక్తి మో ర్చా (జేఎంఎం), ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ (ఐఐపీ) కూడా ప్రతిపక్షంతో చేతులు కలపడంతో కూటమి ఎనిమిది పార్టీలకు విస్తరించినట్లయింది. ఈ నేపథ్యంలో  సీట్ల పంపకం మరింత ఇబ్బందిగా మారింది. అయితే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ గురువారం రాత్రి 48 మంది అభ్యర్థులతో తొలి విడత జా బితాను విడుదల చేసింది.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయమై అటు అధికార, ఇటు ప్రతిపక్ష కూటమి ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాయి. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని, ప్రస్తుతం నితీశ్ నేతృత్వంలో తాము ఎన్నికల ప్రచారం చేస్తున్నామని అమిత్ షా తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తుండగా.. మిత్రపక్షాలు మాత్రం ఆర్జేడీ నేత తేజ స్వీ యాదవ్ పేరును బహిరంగంగా వెల్లడించాయి.

ఒకవైపు రాహుల్ స మక్షంలోనే తాను సీఎం అభ్యర్థినంటూ తేజస్వీ యాదవ్ ప్రకటించినా సీట్ల డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు కాంగ్రెస్ ఈ అంశంపై మౌనంగానే ఉం డిపోయింది. అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పార్టీ తొలిసారి ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది.

తాను పోటీ చేయకపోయినా పార్టీ మాత్రం 150 సీట్లు గెలు స్తుందని ప్రశాంత్ కిశోర్ ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు మా పార్టీని నమ్మితే 150 సీట్లకు మించి గెలుస్తామని, నమ్మకపోతే 10 సీట్ల కన్నా తక్కువకే పరిమితమవుతామని తేల్చిచెప్పడం ఆయనకే చెల్లింది.