సద్గురు శివానందకు జేజేలు
ఆచార్య మసన చెన్నప్ప :
సద్గురు శివానంద మూర్తిని తలుచుకుంటే రామకృష్ణ పరమహం స, రమణ మహర్షి, మాస్టర్ సి.వి.వి గుర్తుకువస్తారు. సనాతన ధర్మ సారథుల్లో వీరొ కరు. భౌతికంగా దేశాన్ని బలోపేతం చేయ డం ఎంత ముఖ్యమో, ఆధ్మాత్మికంగా దేశా న్ని నిలబెట్టడం అంతే ముఖ్యం. అందుకు మన మహర్షులందరూ కృషి చేసిన వారే, తమ తపస్సులను ధారవోసిన వారే. వారి లో వర్తమానంలో ఉండి సద్గురువుగా అం దరి మన్ననలను పొందుతూ, దైవ భక్తిని, దేశ భక్తిని ప్రబోధించిన మహనీయులు శ్రీ శివానందమూర్తిగారు.
ఉపనిషత్తులు ఎ లాంటి వారినైనా మార్చివేసే శక్తి కల్గినవి. అలనాటి వివేకానందుల వలె మన శివానందమూర్తి గారు ఉపనిషత్ స్త్రోతస్వినిలో మునిగి తేలినారు. కనుకనే కఠోపనిషత్ ఆధారంగా ‘కరయోగం’ అనే గ్రంథాన్ని రచించారు. కఠోపనిషత్తులో రెండు రాజ్యా లు కనిపిస్తాయి. మొదటిది ప్రేయోరా జ్యం, రెండోది శ్రేయోరాజ్యం.ఈ రెండు రా జ్యాలను ఆకళింపు చే సుకున్న రాజయోగి శివానందమూర్తి గారు.
వరంగల్లులో ఆశ్రమాన్ని నెలకొల్పి సామాన్యులకే గాక, ఆ యా రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి కి ఆధ్మాత్మికంగా పునర్జన్మనిచ్చారని వా రి ని గూర్చి చెప్పుకుంటారు. సంసృతి అంటే ఎవరికి ప్రాణ మో, వారే శివానందమూర్తిగారు. ‘భారతీయత’ అనే పేరుతో వారు సంకలనం చేసిన వ్యాస సంపుటి జన్మభూమి పట్ల వీరికి గల అభినివేశాన్ని తేట తెల్లం చేస్తుంది.
ఋ షి సంప్రదాయానికి చెందిన ఈ సద్గురువు 42 మంది మహర్షులను గూర్చి ఒక మ హాగ్రంథాన్నే రచిం చారు. దాని పేరు ‘మార్గదర్శకులు మహర్షులు’. విష్ణు సహస్రనా మావళిని వ్యా ఖ్యానించినవారు ఎందరో ఉన్నారు. కాని వారి వ్యాఖ్యానం ఆంగ్లంలో ‘భీష్మబోధ’గా అవతరించింది. శివానందమూర్తి గారు భారతదేశ ఔన్నత్యాన్ని విశదపరిచే ఏం అంశాన్ని విడిచిపెట్టలేదు. ‘గౌతమ బుద్ధ’ సినిమాకు కథను అందించారు.
మార్గదర్శకులుగా
పతంజలి యోగ దర్శనాన్ని అనుసరించి యమనియమాలు మానవుని జీవి తాన్ని మార్చివేసే అద్భుత సోపానాలు! నియమములు మనిషిని సామాజికుణ్ణి తయారు చేస్తే, నియమములు అదే మనిషిని మనీషిగా, మహనీయునిగా నిలబెడు తాయి. శివానంద సద్గురువు యమనియమాలను పాటించడంలో దిట్ట. శౌచ సం తోషతపస్సాధ్యాయేశ్వర ప్రణిధానాలు ని యమా లు. శివానందులు వీటిని జీవితకాలమంతా అనుసరించారు.
ఒక్కొక్కదాన్ని అలవర్చుకొని మనకు మార్గదర్శకులయ్యారు. అంతరంగ, బహిరంగ శుచికి ప్రా ధాన్యమిచ్చారు. సాత్వికమైన ఆలోచన అంతరంగా నికి సంబంధించింది కాగా, సాత్విక భోజనం, సాత్విక వ్యవహారం బహిరంగ శూచికి సంబంధించింది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం అలవాటు చేసుకున్నారు. కావలసిన దానికంటే మించింది కావాలని కోరలేదు. ప్రాప్తించిన దానితో తృప్తి పడ్డారు. ఆకలి దప్పులను సహించి, శీతోష్ణాలను భరించి తపశ్చర్యకు పూనుకొన్నారు.
ఇతరుల దుఃఖాలను పో గొట్టడానికి క్షాళన అ నే తపశ్చర్యను సా ధన చేశారు. స్వాధ్యా యం శివానంద మూర్తి గారి జీవితంలో ప్రధానమైన పా ర్శ్వం. వారు ముప్పు ఏం డ్లకే పదివేల గ్రం థాలను అధ్యయనం చేశారు. వేదోపనిషత్తుల రహస్యాలను ఆకళింపు చే సు కున్నారు. బహుశా నాకు తెలిసినంత వ రకు స్వాధ్యాయంలో శివానందమూర్తితో సాటి రాగల్గిన వారు తక్కువగా ఉంటారు ఈ కాలంలో. శివానందమూర్తి గారు కరుణాళువు. కళాపోషకులు. ఎక్కడ బాధ ఉం దో అక్కడ తాను బోధకునిగానే కాక, దా తృత్వాన్ని ప్రదర్శించి ఆదుకునేవారు.
అవార్డు ప్రదానోత్సవం
శివానందమూర్తిగారు నిరాడంబరులు, వ్యక్తి కంటే వ్యక్తిత్వమే గొప్పదని భావించారు. ప్రతియేటా హైదరాబాదులో వారు స్థాపించిన ‘సనాతన ధర్మ చారిటబుల్’ ట్ర స్టు ఆధ్వర్యంలో కళాకారులకు, విజ్ఞానవేత్తలకు, రచయితలకు సన్మానాలు జరిగేవి. విశేషించి వారికి సంగీత నృత్యాల పట్ల మ క్కువ ఎక్కువ. కనుకనే ‘ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ’ని స్థాపించారు. దీని ఆధ్వర్యం లో సంగీతోత్సవాలు జరిగేవి. ప్రతి ఏటా సికింద్రాబాద్ టివోలి గార్డెన్‌లో జరిగే కా ర్యక్రమంలో వారు స్వయంగా పాల్గొనేవా రు.
‘శివానంద ఎమినెంట్ సిటిజన్స్ అవా ర్డ్’ ప్రదానోత్సవం ఘనంగా నిర్వహింపబడేది. ఒక సంవత్సరం నేను ఒక ప్రేక్షకునిగా వెళ్లాను. వారిని దర్శించి కొద్దిసేపు ముచ్చటించాను. ఆ సన్నివేశాన్ని నేనెప్పుడూ మరిచిపోను. వారికదే సమయంలో నేను రచించిన ‘బృహద్గీత’ను ఇచ్చాను. వారు ప్రేమపూర్వకంగా స్వీకరించి ‘దీన్ని నేను చదువుతాను’ అన్నారు. ఆ మాటకు నేనెంతగానో సంతోషించాను. వారు చేతితో ముట్టుకుంటేనే పవిత్రమవుతుందనుకున్న పుస్తకాన్ని స్వయంగా చదువుతాననడం ఎ నలేని ఆనందానికి కారణమైంది.
ప్రతిభా పురస్కారం
సద్గురు శివానందమూర్తిలో ఒక సనాతన ధర్మ ప్రవక్తను చూడగలిగే అదృష్టం కలిగిందని భావించవలసి ఉంది. వారి తే జోవంతమైన, దేశభక్తపూరితమైన, ధార్మి క జీవనానికి ఆలవాలమైన రచనలను చ దివి ఇంకా మనమెంతో ప్రభావితులం కా వాలి. శ్రేష్ఠుడైనవానిని అనుసరించమని శ్రీ కృష్ణుడు గీతలో ప్రబోధించాడు. మన మ ధ్య నివసించిన శివానందమూర్తి శ్రేష్ఠుల లో శ్రేష్ఠుడు. సనాతనధర్మానికి వారి వలె న్యాయం చేసినవారు లేరు.
వ్యక్తిత్వానికి ఎ క్కడా మచ్చ తెచ్చుకోకుండా, ఒక క్రమశిక్షణతో ఉన్నత ఆధ్మాత్మిక శిఖరాలను అధి రోహించిన శ్రీ శివానందమూర్తిగారు మన కు ఆదర్శం! వారి పేరు మీద ‘సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు’ పక్షాన నాకు 2018లో ‘శ్రీరామనవమి ప్రతిభా పురస్కా రం’ లభించింది. మనం ఉన్నదంతా దా నం చేయలేం.
మన శక్తిననుసరించి కాక, బుద్ధిననుసరించి ఇస్తున్నామనుకుంటే దా నికి సార్థకత లభిస్తుంది. ఐనా అర్థించేవా ణ్ణి పనమేశ్వరుడే మన దగ్గరికి పంపి స్తా డు. వచ్చినవాడు అబద్ధమాడినా, అత ని పేదరికమే అతని చేత అబద్ధమాడించిందని గుర్తించి సాయపడాలి’ అని చేసినవా రి ప్రబోధం మహత్తరమైంది. ఈ సందర్భంలో నాకు ఈశావాస్యోపనిషత్తులోని ప్రథమపంక్తులు గుర్తుకు వస్తున్నాయి.
“ ఈశావాస్యమిదంసర్వమ్
యత్కించ జగత్యాం జగత్
తేనత్యక్తేనభుంజీథా
మా గృధః కస్యస్విద్ధనమ్”
(యజు-40-1).
పరమేశ్వరుడు అంతటా నిండి ఉ న్నాడు. విశ్వంలో అతడు లేని చోటు లేదు. ఈ సంపదంతా అతడిచ్చిందే కనుక త్యాగబుద్ధితో అనుభవించాలి. ఇతరుల ధనాన్ని అపహరించరాదు. ఈ వేదవాణికి అనుగుణంగా నడిచిన మహా పురుషుడు సద్గురు శివానందమూర్తిగారికి నా జేజేలు.






