డిజిటల్ రికార్డులను భద్రపరచండి
- విద్యార్థుల నిరసనలు పబ్లిసిటీ అని ఎలా అంటారు?
- అడిషనల్ సోలిసిటర్ జనరల్‌పై ఢిల్లీ హైకోర్టు సీరియస్
న్యూఢిల్లీ, జూలై 22: కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీలో ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేసినందుకు దిల్లీ హై కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం విద్యార్థులు నిరసనల్లో పా ల్గొన్నారని పోలీసులు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. సీసీ కెమెరాలు, పోలీసుల బాడీ కెమెరాల ఫుటేజీలు.. నిరసనలకు సం బంధించిన అన్ని డిజిటల్ రికార్డులను భద్రపరచాలని ఆదేశించింది.
నిరసనకారులతో అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై నాలుగు వారాల్లోగా పోలీసులు స్పం దించాలని పేర్కొంది. సీజేపీ ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్‌ను సవాల్ చేస్తూ నమోదైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణను సెప్టెంబర్ 11కు వాయి దా వేసింది. సీజేపీ శ్రేణులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ ఢిల్లీ హైకోర్టులో పలు పిటి షన్లు దాఖలయ్యాయి. వీటిపై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సోలిసిటర్ జనరల్‌పై సీరియస్ అయ్యింది. పబ్లిసిటీ పిటిషన్లని మీరు ఎలా అంటారు? అని ప్ర శ్నించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైనప్పుడు పోలీసులు పూర్తి సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిపై నా లుగు వారాల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు జారీచేసింది.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యా లు, ఇతర ఆధారాలను భద్రపరచాలని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్ రాజు మధ్య వాదనలు నడిచాయి.
పోలీసులు మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. నిరసనకారులపై మేకులు ఉన్న లాఠీలను ఉపయోగించారని ఆరోపించారు. పోలీసులకు సంబంధించిన బ్యాడ్జీలు కూడా లేవని కోర్టుకు తెలిపారు. తమ వద్ద 110 వీడియోల ఆధారాలు ఉన్నాయని చెప్పారు.






