సీడ్ బాల్ పంపిణీ
మలక్‌పేట, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భం గా గురువారం తెలంగాణ జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగం ఐఓసీఎ ల్‌తో కలిసి పర్యావరణ స్థిరత్వం, హరిత కార్యక్రమాలలో భాగంగా సీడ్ బాల్ పంపిణీ కార్యక్రమాన్ని జైళ్ల శాఖ డిజి సౌమ్య మిశ్రా చంచల్‌గూడ సెంట్రల్ జైలులోని ఫ్యూయల్ అవుట్‌లో ప్రారం భించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు పచ్చదనాన్ని అందించాలని దృక్పథంలో భాగంగా రాబోయే సీజన్లో ఖైదీల చురుకైన భాగస్వామ్యంతో 2 లక్షల సీడ్ బాల్స్ను సిద్ధం చేయాలని శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విత్తన బంతులను తెలంగాణ అంతటా జైళ్ల శాఖ నిర్వహించే 30 ఇంధన దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారని, వీటిని ఈ అవుట్లెట్లకు వ చ్చే వినియోగదారులకు జైలు సి బ్బందికి పంపిణీ చేస్తారని చెప్పారు.
వారి ప్రయాణాల సమయంలో బంజరు భూములు, నగర శివార్లలో వాటిని వేయమని ప్రోత్సహి స్తారని తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ జైళ్లు వై. రాజే ష్, ఎన్ మురళిబాబు, హైదరాబాద్ రేంజ్ డిఐజి శ్రీనివాస్, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్ పాల్గొన్నారు.






