27 July, 2026 | 3:02 PM

అక్కన్నపేట రైతు వేదికలో విత్తన మేళా

27-07-2026 01:59 PM

అక్కన్నపేట, జూలై 27: అక్కన్నపేట రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి తస్లీమా, వ్యవసాయ విస్తరణ అధికారులు సబీహా, ఐశ్వర్య ఆధ్వర్యంలో సోమవారం విత్తన మేళా నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను అందుబాటులో ఉంచి, వాటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సాగునీటిని పొదుపుగా వినియోగిస్తూ ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ జంగపల్లి ఐలయ్య, అక్కన్నపేట సర్పంచ్ జన్నారపు సంపత్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.