27 July, 2026 | 2:33 PM

శివాలయం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐడీసీ చైర్మన్ మువ్వా

27-07-2026 02:03 PM

సత్తుపల్లి. జులై 27,(విజయక్రాంతి): సత్తుపల్లిపట్టణంలోని గుడిపాడు రోడ్డులోని శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో టి జి ఐ డి సి  చైర్మన్  మువ్వా విజయబాబు  పాల్గొని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి మరియు మువ్వాఅభిమానులు పాల్గొన్నారు.