28 June, 2026 | 1:50 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

సపాయితో కలిసి మురికి కాలువను పూడిక తీసిన సీతంపేట సర్పంచ్ భర్త

16-12-2025 08:30 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని సీతంపేట గ్రామంలో మంగళవారం నూతనంగా గెలిచిన గ్రామ సర్పంచ్ ఇండ్ల కృష్ణవేణి భర్త సదయ్య సపాయితో కలిసి గ్రామంలోని మురికి కాలువను పూడిక తీశాడు. గ్రామంలో గత కొంతకాలంగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడంతో గ్రామంలోని మురికి కాలువలు నిండి దుర్వాసన వస్తుందని గ్రామస్తులు సర్పంచ్ కి తెలుపడంతో సర్పంచ్ ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన సపాయి నరేష్ ఒక్కడే మురికి కాలువలు శుభ్రం చేస్తున్నాడు. ఒక్కడు పడుతున్న ఇబ్బందిని గమనించిన సర్పంచ్ భర్త సదయ్య సపాయితో కలిసి మురికి కాలువలో పూడికను తీశాడు. దీంతో గ్రామస్తులు సర్పంచ్ భర్త సదయ్యను అభినందిస్తున్నారు.