21 March, 2026 | 12:58 AM

రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

20-03-2026 12:00 AM

కాగజ్‌నగర్, మార్చి 19 (విజయక్రాంతి) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సిర్సిల్క్ ఎఫ్ కాలనీలో గురువారం జూనియర్  యువకుల బాలు రు, బాలికల కోసం జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలను  నిర్వహించారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి.

యూ-17 బాలురు విభాగoలో ఏ ప్రేమ్, 44-46 కిలోలు వి యశ్వంత్, ఆర్ దీక్షిత్ , U-17 బాలిక ల విభాగంలో  టి సంజన,  U-19 బాలురు విభాగంలో సాయి కృష్ణ, టి దిలీప్‌లు ఎంపికైన క్రీడాకారులు  ఎంపికయ్యా రు .మార్చి 22 నుంచి 24 వరకు హైదరాబాద్లోని షైక్పేట్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా  నిర్వాహకులు  జిల్లా బాక్సింగ్ అస్సోసియేషన్ చైర్మన్ శివ నాయర్, అధ్యక్షులు వేమూర్ల మధు, సెక్రటరీ మధురై శేఖర్, వైస్ ప్రెసిడెంట్ కే. జయెందర్, జోమ్ నిర్వాహకులు పంజాల కార్తిక్, సీనియర్ కోచ్ బాక్సర్, సాయి గౌడ్, సీనియర్ బాకర్లు శివ వంశీ ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ, రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు.