కాంగ్రెస్‌కు కొత్త ఊపు
54 మంది సభ్యులతో బలమైన జిల్లా కమిటీ
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 19(విజయ క్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆమోదంతో కు భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కొత్త దిశ, కొత్త శక్తిని అందించేలా 54 మంది సభ్యులతో జిల్లా కమిటీని ప్రకటించారు. ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, కోశాధికారి, ప్రతినిధులు, కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క తెలిపారు.
జిల్లాలో పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేసి, ప్రజల సమస్యలపై గట్టిగా పోరాటం చేయడమే లక్ష్యంగా కమిటీని రూపొందించినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసే నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ కమిటీని రూపొందించామని తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా అని, జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలంగా నిలబెట్టే దిశగా ప్రతి నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్త కమిటీతో జిల్లాలో కాంగ్రెస్ కార్యకలాపాలు మరింత వేగం అందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కమిటీ కూర్పుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు సుగుణ కృతజ్ఞతలు తెలిపారు.




