21 March, 2026 | 2:26 AM

మున్నూరు కాపులు అన్ని రంగాల్లో ఎదగాలి

20-03-2026 12:00 AM

నిర్మల్ మార్చి 19 ( విజయ క్రాంతి) : నిర్మల్ ప్రాంతంలో మున్నూరు కాపు అన్ని రంగాల్లో ఎదిగి సమాజాభివృద్ధికి పాటుపడాలని మున్నూరు కాపు మిత్రమండలి అధ్యక్షులు అప్పల మహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి అన్నారు. మున్నూరుకాపు మిత్రమండలి  25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేడుకలు నిర్వహించారు.

మున్నూరు కాపు మిత్రమండలి ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను వివరించారు అనంతరంసందర్బంగా శ్రీ గుడి రాజేశ్వర్ శర్మ గారిచే పంచాంగ శ్రవనం జరిపి నూతనంగా ఎన్నుకోబడ్డ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి అప్పాల కావ్య గారిని,వైస్ చైర్మన్ శ్రీ అప్పాల గణేష్ చక్రవర్తిగారిని, వివిధ వార్డులలో  ఎన్నుకోబడ్డ మున్నూరుకాపు కౌన్సిల ర్లను మరియు వివిధ గ్రామాల సర్పంచులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మిత్రమండలి అధ్యక్షులు శ్రీ అప్పల మహేష్ గారు, ప్రధాన కార్యదర్శి గండ్రత్ రమేష్ గారు, కార్యవర్గ సభ్యులు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.