14 April, 2026 | 9:02 PM

13న బార్ల లబ్ధిదారుల ఎంపిక

12-06-2025 01:09 AM

28 బార్లకు లాటరీ పద్ధతిలో సెలక్షన్

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): జీహెఎంసీ పరిధిలో 24, రూరల్ జిల్లాలో నాలుగు బార్లకు వచ్చిన దరఖాస్తుల్లోంచి ఈ నెల 13న లాటరీ పద్ధతి ద్వారా లబ్దిదారుల ఎంపిక జరుగనుంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ కమిషనర్ సి. హరి కిరణ్ జీహెఎంసీ, రూరల్ జిల్లాల్లో  మూత పడిన బార్ల పునరుద్దరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 బార్లకు 3,520 దరఖాస్తులు, రూరల్  జిల్లాల్లో 4 బార్లకు 148 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 13న జరిగే బార్ల డ్రాకు అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్, రంగారెడ్డి డిప్యూటి కమిషనర్లు కేఏబీ శాస్త్రీ, పి. దశరథ్ తెలిపారు.