ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
నాగల్ గిద్ద, మార్చి 10: నాగల్ గిద్ద మండల పరిధిలోని గంగారం తాండ గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి మన్మధ కిషోర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలలో టిఎల్‌ఎం ఏ ర్పాటు చేయడం అద్భుతమని, ఎక్కడ కూడా ఈ విధంగా టీఎల్‌ఎం ఏర్పాటు చేయలేదని తెలిపారు.
పాఠశాలను ఇంత చక్కగా తయారుచేసిన ప్రధాన ఉపాధ్యాయులు తులసి రావు, మా నసను అభినందించారు. కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్ రావు, పిఆర్టి యు మండల అధ్యక్షులు శేరికర్ రమేష్, ప్రధాన కార్యదర్శి నాగనాథ్, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సూర్యకాంత్, గ్రామ సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి గోపాల్ రెడ్డి, మండల స్ట్రాంగ్ టీచర్ రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




