ఆర్సీబీని అమ్మేయండి..
బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేలవ ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ ఫ్రాం చైజీని అమ్మకానికి పెట్టాలంటూ అసహ నం వ్యక్తం చేశాడు. సా మాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘స్పో ర్ట్స్, ఐపీఎల్ అభిమానులు, చివరికి ఆటగాళ్ల కోసమైనా ఆర్సీబీని బీసీసీఐ కొత్త యాజమాన్యానికి విక్రయించాలి. ఇతర జట్ల లాగా స్పోర్ట్స్ ఫ్రాంచైజీని నిర్మించడంలో శ్రద్ధ వహించే యాజమాన్యానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్రదర్శన చాలా బాధాకరం అని ట్వీట్ చేశా డు. కాగా మహేశ్ భూపతి బెంగళూరు జట్టుకు వీరాభిమాని. ఈ సీజన్‌లో ఆర్సీబీ బౌలర్లు ప్రతి మ్యాచ్‌లో దారాళం గా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా సోమవా రం హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బౌలర్లు పూర్తి గా తేలిపోయారు. 287 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ తీవ్రంగా పోరాడినప్పటికి ఓటమి తప్పలేదు. 262 పరుగుల చేసి లక్ష్యానికి 25 పరుగుల దూరంలో ఆగిపోయింది.






