ఇంటర్ పూర్తయిన వారికి ఉన్నత అవకాశాలపై సదస్సు
16-03-2026 12:00 AM
సిద్దిపేట, మార్చి 15 : ఈ నెల 17న తెలంగాణా విద్య సమితి ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ఆర్‌ఎస్ మెట్రో గార్డెన్ లో ఇంటర్మీడియట్ పూర్తి అయిన విద్యార్థులకు కాలేజీలు, కోర్స్లు, ఫీజులు, మెరిట్ స్కాలర్షిప్స్, ఉద్యోగ అవకాశాలు గురించి అవగాహన సదస్సు జరగనుంది. తెలంగాణాతో పాటు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు కాలేజీలు పాల్గొననున్నాయి. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు వినియోగించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు, మున్సిపాల్ చైర్ పర్సన్ మంజుల కోరారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సదస్సు కొనసాగుతుంది.




