2 June, 2026 | 6:03 PM

Breaking News

కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు   •   పరిపాలన చేతకాక సీఎం బూతు మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే తలసాని   •   రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారులు, పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం   •   అమరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పునాదులు   •   పారమితలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   విద్యార్థుల ప్రాణ త్యాగాలు.. కెసిఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు   •   పెద్దకాపర్తిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   వాడవాడలా తెలంగాణ అవతరణ వేడుకలు   •   సీఎం రేవంత్ రెడ్డి నమ్మిన బంటు ఆసిఫ్ అలీకి అరుదైన గుర్తింపు   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం అభినందనీయం   •  

జోగులాంబ గద్వాల జిల్లాలో వయోవృద్ధుల వారోత్సవాలు

15-11-2025 07:09 PM

గద్వాల: శనివారం మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గద్వాల రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యాలయం ప్రాంగణంలో వృద్ధుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పౌరులకు ఉత్సాహాన్నిస్తూ క్యారమ్స్, చెస్, పాటల పోటీలు నిర్వహించగా, వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వయోవృద్ధుల సంక్షేమానికి అందరూ కలిసి పని చేయాలనే సందేశంతో పాటు, సీనియర్ సిటిజన్ల ఆరోగ్యం, శ్రేయస్సు, సామాజిక భాగస్వామ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ర్యాలీ కూడా నిర్వహించినట్లు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి సునంద తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం. లక్ష్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్, సభ్యులు బాలకృష్ణ రావు, బాలస్వామి తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.