16 July, 2026 | 11:43 AM

27 ఏండ్ల తర్వాత బోర్డర్‌కు సీక్వెల్

16-06-2024 12:05 AM

బాలీవుడ్‌లో హిట్ కొట్టిన ఓ సినిమాకు ఇరవై ఏండ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది. ‘బోర్డర్’కు సీక్వెల్‌గా ‘బోర్డర్2’ తెరకెక్కించనున్నట్టు బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ అధికారికంగా ప్రకటించారు. ఆయన హీరోగా జేపీ దత్తా దర్శకత్వంలో 1997లో జూన్ నెలలో వచ్చింది ‘బార్డర్’. సరిగ్గా ఇప్పుడు 27 ఏండ్ల తర్వాత సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. మొదటి పార్ట్‌కు జేపీ దత్తా దర్శకత్వం వహించగా, సీక్వెల్‌కు మాత్రం ఆయనకు బదులుగా అనురాగ్ సింగ్ డైరెక్షన్ బాధ్యతలు చేపట్టారు. ‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు 27 ఏండ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియన్ బిగ్గెస్ట్ వార్ ఫిల్మ్’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు సన్నీ డియోల్. భూషణ్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1971లో ఇండియా మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో అప్పట్లో ‘బోర్డర్’ను తెరకెక్కించారు. మరి, సీక్వెల్ కథ ఏమిటన్నది స్పష్టత రావాల్సి ఉంది.