30 July, 2026 | 6:46 PM

సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ

30-07-2026 05:29 PM

హత్నూర: విధి నిర్వహణలో నిబద్ధతతో చేసిన సేవలే ఉద్యోగికి శాశ్వత గుర్తింపునిస్తాయని సీఎంఓ భీమ్ గొండ అన్నారు. హత్నూర మండలం కాసాల గ్రామ శివారులోని బీఎన్ రెడ్డి గార్డెన్స్‌లో స్కూల్ అసిస్టెంట్ సాయమొల చంద్రయ్య పదవీ విరమణ అభినందన సభలో మాట్లాడాతూ ఉపాధ్యాయ వృత్తి సమాజ నిర్మాణానికి పునాదిగా నిలుస్తుందని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో చంద్రయ్య అందించిన సేవలు ఆదర్శప్రాయమని పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో జీవించాలనిఆకాంక్షించారు.

చంద్రయ్య తన ఉద్యోగ జీవితంలో సహకరించిన సహచరులు,ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింగ్ రాజ్, సర్పంచ్‌లు శ్రీహరి, ఎల్లయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేష్, నాయకులు, ఉపాధ్యాయులు,విద్యార్థలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.