సీఐ అశోక్ రెడ్డి సేవలు అభినందనీయం.. దోసపాటి పిచ్చేశ్వరరావు
అశ్వాపురం, (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో రెండేళ్లకు పైగా సీఐగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న సీఐ అశోక్ రెడ్డిని దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, శివకామేశ్వరీ గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అశోక్ రెడ్డి అందించిన సేవలు అభినందనీయమని, మండలంలోని అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. కొత్త బాధ్యతల్లో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించి ఆయురారోగ్యాలతో ఉండాలని భద్రాద్రి శ్రీరాముడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తన విధి నిర్వహణలో దోసపాటి పిచ్చేశ్వరరావు అందించిన సహకారానికి సీఐ అశోక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.






