27 August, 2026 | 10:56 PM

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అమోఘం

27-08-2026 09:47 PM

చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్

జవహర్ నగర్,(విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణలో జవహర్ నగర్ పోలీసుల సేవలు అమోఘమని చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో ఇటీవల జరిగిన బోనాల జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుటకు బందోబస్తు నిర్వహించిన జవహర్ నగర్ పోలీసులను అభినందిస్తూ గురువారం జవహర్ నగర్ కాంగ్రెస్ నేతలు తో కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ చట్టాలను పరిరక్షించడంలో పోలీసుల సేవలు అమోఘమన్నారు. జవహర్ నగర్ లో జరిగిన బోనాల వేడుకలలో ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయని ఈ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుగుటకు ఉపకరించిన జవహర్ నగర్ పోలీసుల సేవలు నిరూపనమన్నారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు, సబ్ ఇన్స్పెక్టర్ రామ్ నాయక్ లను శాలువాలతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు.