కబ్జా కోరల్లో.. నల్లాల బావి.!
యథేచ్ఛగా దుకాణం ఏర్పాటు
రూ. 60 లక్షల భూమికి కబ్జారాయుళ్ల ఎర..
పట్టించుకోని అధికారులు
రామాయంపేట, ఆగస్టు 2: దాహంతో అల్లాడుతున్న ప్రజల గొంతు తడిపిన భావిస్తలం కబ్జా కొరల్లో చిక్కుకుంది. ఏళ్లపాటు ప్రజల దాహం తీర్చిన ఆ భావి కాలక్రమంలో పోర్చుకుపోయింది. ఇదే అదునుగా భావించిన కొందరు కబ్జాదారులకు ఆ భావిస్తాలంపై కన్ను పడింది.
ప్రధాన రహదారికి ఆనుకుని ఉండడం ప్రస్తుతం ఆ స్థలానికి రూ. 50 నుంచి 60 లక్షల విలువ ఉండడంతో ఎలాగైనా సొంతం చేసుకోవాలని రేకుల దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రామాయంపేట పట్టణంలో ఒకప్పుడు ప్రజల గొంతు తడిపేందుకు పట్టణంలోని వెంకటేశ్వర ఆలయ పూజారి రామాంజనేయ చార్యులు 200 గజాల తన సొంత స్థలాన్ని గ్రామపంచాయతీకి దానం ఇచ్చాడు.
ఈ స్థలాన్ని గ్రామకంఠగా నమోదు చేసినట్లు పలువురు తెలిపారు. దీంతో అక్కడ మంచినీటి భావి తావినారు. అక్కడి నుండి మోటర్ల ద్వారా ట్యాంకులు నింపి దాహం తీర్చేవారు. కార్యక్రమంలో నల్లల బావి నీటిని వాడకపోవడంతో పూడ్చుకుపోయింది. రామాయంపేట నిజాంబాద్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ స్థలానికి సుమారు గజానికి 50 వేలు పలుకుతుంది. దీంతో కబ్జాదారుల కన్ను ఆ స్థలం పై పడింది. అంతే కాకుండా చుట్టుపక్కల స్థలాల యజమానులు సైతం ఈ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఏకంగా ఈ స్థలంలో కబ్జాదారులు రేకుల దుకాణం ఏర్పాటు చేసి వ్యాపారం చేసేవారికి కిరాయికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ స్థలం విలువ 60 లక్షల వరకు ఉంటుంది అయితే నల్లల బావి స్థలానికి సంబంధించి గ్రామపంచాయతీలో రికార్డులు లేవని అప్పుడు అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రజలు దాహం తీర్చడానికి వెంకటేశ్వర ఆలయ పూజారి తన సొంత స్థలాన్ని పంచాయతీకి దానం ఇచ్చిన దానికి రికార్డుల్లో నమోదు చేశారు. లేద ఉంది అని కూడా అధికారులు స్పష్టంగా తెలపడం లేదు.
స్థలాన్ని కబ్జా నుండి కాపాడాలి...
అప్పుడు పంచాయతీకి దానం ఇచ్చిన నల్లల భావి స్థలాన్ని కొందరు కబ్జా చేసి ఏకంగా రేకుల దుకాణం ఏర్పాటు చేసినా అప్పుడు పంచాయతీ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడ లేదు, ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. పట్టణ ప్రజల దాహం తీర్చిన నల్లాల భావి స్థలాన్ని కాపాడి మున్సిపల్ అధికారులు ఆ దినం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కంచె ఏర్పాటు చేస్తాం..
నల్లాల భావి స్థలాన్ని కబ్జా చేసిన విషయం తమకు తెలియదు. ఇందుకు సంబంధించిన రికార్డులు కూడా లేవు. పట్టణ ప్రజలకు దాహార్తిని తీర్చిన నల్లల బావి స్థలం కబ్జాకు గురి కాకుండా స్థలం చుట్టూ కంచ ఏర్పాటు చేస్తామని అలాగే రేకుల దుకాణా స్థలాన్ని పరిశీలిస్తామన్నారు.
- మున్సిపల్ కమిషనర్, రవీందర్






