3 August, 2026 | 2:48 AM

ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతం చేసిన క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, బీఎల్‌ఏలకు సన్మానం

03-08-2026 01:39 AM

రామగిరి ఆగస్టు 2 (విజయ క్రాంతి)ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన క్లస్టర్ ఇన్చార్జీలు, బీఎల్‌ఏలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు ఆదివారం కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.ఎస్. అన్వర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన క్లస్టర్ ఇన్చార్జీలు, బీఎల్‌ఏలను అభినందించారు.

పార్టీ బలోపేతానికి కార్యకర్తల సమిష్టి కృషి అవసరమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎస్.ఎస్. అన్వర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ ఎల్లప్పుడూ గుర్తించి గౌరవిస్తుందని, వారి సేవలకు తగిన గుర్తింపు కల్పించేందుకు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.