3 August, 2026 | 2:51 AM

రామగిరి మండల ప్రైవేట్ పాఠశాలలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం

03-08-2026 01:40 AM
  1. టీచర్ల శ్రమను దోచుకుంటున్న స్కూల్ యజమాన్యాలు 
  2. బిజెపి ఎంపిటిసి ఫోరం మాజీ,జిల్లా అధ్యక్షుడు మొలమూరు శ్రీనివాస్

రామగిరి ఆగస్టు 2 (విజయక్రాంతి)రామగిరి మండలం లో ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల శ్రమ దోపిడీ ఆగాలి కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ తప్పనిసరిగా అమలు చేయాలి.ప్రైవేట్ పాఠ శాలల్లో పనిచేస్తున్న అనేక మంది ఉపాధ్యాయులు తీవ్ర శ్రమ దోపిడీకి గురవుతున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. విద్యార్థుల నుంచి వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని ప్రైవే ట్ పాఠశాలల యాజమాన్యాలు, అదే పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం కనీస వేతనాలు కూడా చెల్లించకపోవడం దారుణం.రోజంతా కష్టపడి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు, కొన్నిచోట్ల కాంట్రాక్ట్ కార్మికుల కంటే కూడా తక్కువ వేతనాలు చెల్లించడం సిగ్గుచేటు.

అనేక పాఠశాలల్లో ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించకపోవడం కార్మిక చట్టాల ఉల్లంఘనగా పరిగణించాల్సిన అంశం.ప్రైవేట్ పాఠశాలలపై పర్యవేక్షణ చేయాల్సిన ఎంఈఓ (MEO), డీఈఓ (ౄEO) అధికారులు ఇటువంటి అంశాలపై సమర్థంగా స్పందించకపోవడం వల్ల యాజమాన్యాలు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలు, ఆ ఆదాయానికి తగిన విధంగా ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన వేతనాలు ఎందుకు చెల్లించడం లేదో అధికారులు విచారించాలి.ప్రభుత్వం వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి:ప్రైవేట్ ఉపాధ్యాయులకు కనీస వేతనాలు అమలు చేయాలి.పీఎఫ్,

ఈఎస్‌ఐ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలి.అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై సమగ్ర విచారణ జరపాలి.కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉపా ధ్యాయుల ఉద్యోగ భద్రతను కల్పించాలి.ఉపాధ్యాయుల శ్రమను దోచుకుంటూ విద్యను వ్యాపారంగా మార్చే ధోరణి వెంటనే ఆగాలి. ప్రైవేట్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని మేము బలంగా డిమాండ్ చేశారు. పెద్దపల్లి సెoటనర్ కాలనీ టౌన్ అధ్యక్షుడు తీగల శ్రీధర్ మెరుగు శ్రీకాంత్ దొంతుల సురేష్ పాల్గొన్నారు