07-07-2025 12:00:00 AM
చేగుంట, జులై 6 : సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్ లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 18 బాల, బాలికల రగ్బీ పోటీల ఎంపీకలో మెదక్ జిల్లా నుండి ఏడుగురు క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని మెదక్ జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కర్ణం గణేష్ రవికుమార్, మల్లీశ్వరి తెలిపారు.
ఎంపికైన వారిలో చేగుంట మండల కేంద్రంలోని ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన నందిని, దీపిక, సంపూర్ణ, స్టాండ్ బై గా అంకిత ఉన్నారు. బాలుర విభాగంలో తూప్రాన్ లోని బాలుర గురుకుల కళాశాల కు చెందిన విష్ణు, శ్రీ చరణ్, రాకేష్, కార్తీక్ స్టాండ్ బైగా సెలెక్ట్ అయ్యాడు.
బాలికల పోటీలు ఈనెల 8వ తేదీ నుండి 10 వరకు, బాలురకు ఈ నెల 12 నుంచి 14 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు మెదక్ జిల్లా టీంకు కోచులుగా నవీన్, రంగీలా, వ్యవహరించారు. నుంచి క్రీడాకారులు ఎంపికైనందుకు చేగుంట స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపల్ సుమతి, రజిత, తూప్రాన్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాల ప్రిన్సిపల్ తారాసింగ్ హర్షం వ్యక్తం చేశారు.