07-07-2025 04:43:55 PM
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండా వెంకన్న
చండూరు (విజయక్రాంతి): ఎక్స్‌గ్రేషియా బాధితుల కోసం ఈనెల 14న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయాలని, ఎక్స్‌గ్రేషియా బాధితులు, గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న(District President Konda Venkanna) అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సేఫ్టీ కిట్లపై ప్రారంభించాడు. గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా రెండు రోజులలో ఇస్తానని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వానిపై మండిపడ్డారు. గీత కార్మికుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం అని ఆయన అన్నారు.
కల్లుగీత ఫెడరేషన్ ఏర్పాటు చేసి 5000 కోట్లు బడ్జెట్లో కేటాయించాలని, పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియను వెంటనే ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కల్లులో అనేక పోషక విలువలు ఉన్నాయని, క్యాన్సర్ లాంటి రోగాల నుండి కాపాడవచ్చు అని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతుందని అందుకని మన సంఘం తరపున పాల్గొనాలని ఆయన గీత కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 20న చండూరులో జరిగే మునుగోడు నియోజకవర్గ స్థాయి మండల మహాసభలను జయప్రదం చేయాలని, గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోతెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ, మొగుదాల వెంకటేశం, అయిత గోని మల్లేష్ గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం నాయకులు తందారుపల్లి యాదయ్య, చండూర్ సొసైటీ అధ్యక్షులు నకర కంటి బిక్షమయ్య గౌడ్, చండూరు సొసైటీ ఉపాధ్యక్షులు చేనగోని అంజయ్య తదితరులు పాల్గొన్నారు.