16 August, 2026 | 4:17 PM

బాలికపై లైంగికదాడి

29-11-2024 03:40 AM

నిందితుడిపై   పోక్సో కేసు

కామారెడ్డి, నవంబర్28 (విజయక్రాంతి): బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. రామారెడ్డి ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం రామారెడ్డి గ్రామానికి చెందిన మర్కంటి రాజకుమార్ అనే యువకుడు ఓ గ్రామానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి లైంగిక దాడులకు పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించగా, వారు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.