16 August, 2026 | 3:18 PM

అయ్యప్పస్వాములపై వేధింపులు తగదు

29-11-2024 07:02 AM

మహబూబాబాద్  నవంబర్ 28 :తొర్రూరు ఆర్టీసీ డిపోలో అయ్యప్ప మాలాధారులకు బ్రీత్ ఎనలైజింగ్ టెస్ట్ చేస్తున్న డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని, అయ్యప్ప భక్తులతో ఆయన దురుసుగా ప్రవర్తిస్తూ.. వేధిస్తున్నారని బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన ఈ మేరకు ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌ను కలిసి వినతి పత్రం అందించారు.  మాలధారులకు బ్రీత్ ఎనలైజింగ్ పరీక్షలు చేసిన సిబ్బంది ని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.