3 July, 2026 | 7:45 PM

షారుక్ తనయుడి సినిమా సిద్ధం

18-08-2025 01:19 AM

బాలీవుడ్ స్టార్ షారుక్‌ఖాన్ తనయుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే, హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయం కానున్నాడు ఆర్యన్ ఖాన్. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. హిందీ చిత్ర పరిశ్రమ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.  ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ గ్లింప్స్‌ను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ఈ మూవీ టీజర్‌ను సైతం ఈ నెల 20న విడుదల చేయనున్నట్టు తాజా వీడియో ద్వారా ప్రకటించారు.