18-08-2025 01:21:07 AM
హీరో డాలీ ధనంజయ, సప్తమిగౌడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హలగలి’. ఇది కర్ణాటకలోని ఓ ఊరిపేరు. ఆ పేరే సినిమాకు టైటిల్‌గా పెట్టారు. ‘హలగలి’ చరిత్రలో ఒక అధ్యాయం. బ్రిటిష్‌కు వ్యతిరేకంగా వారు చేసిన చిరస్మరణీయ పోరాటాన్ని కన్నడలో పదో తరగతి పాఠ్యాంశంగా ఉంది. ఈ చారిత్రక నేపథ్యాన్నే సినిమాగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకేశ్ నాయక్. దీన్ని కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాళ్ల నిర్మిస్తున్నారు.
వేట ప్రధాన వృత్తిగా బతుకే ‘హలగాలి’ వాసులు బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొన్న తీరును సినిమాటిక్‌గా తెరపై చూపించనున్నారు. కత్తులు, గొడ్డళ్లే ఆయుధాలుగా బ్రిటిష్‌వాళ్లతో వీరోచితంగా పోరాడినప్పటికీ వారి తుపాకీ గుళ్లకు బలికాక తప్పలేదు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా గ్లింప్స్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ధనంజయ్‌ను కమాండింగ్ అవతార్‌లో ప్రజెంట్ చేసిన ఈ గ్లింప్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా చేసింది.