calender_icon.png 15 February, 2026 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివనామస్మరణతో మారు మోగిన శైవక్షేత్రాలు

15-02-2026 06:43:13 PM

సుల్తానాబాద్(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం లో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం శివనామ స్మరణలతో శైవ క్షేత్రాలు మారుమోగాయి, శివాలయాల్లో దర్శనలకు భక్తులు పోటెత్తారు. భక్తులు తెల్లవారుజాము నుండే ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని గుడి మిట్టపల్లిలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం ఆవరణలో గల సాంబశివ దేవాలయంలో, పాతవాడలోని

శ్రీ శివాలయంలో అర్చకులు పోలస అశోక్, పారువెళ్ల రమేష్ శర్మ, వల్ల కొండ మఠం రమేష్, వల్లకొండ మఠం మహేష్ లు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. శ్రీ శివాలయంలో చైర్మన్ అల్లంకి భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు, శివాలయాల భక్త బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు... అలాగే సుల్తానాబాద్ పట్టణం తోపాటు మండలంలోని పలు గ్రామాల్లోను మహాశివరాత్రి పండుగ వేడుకలను ప్రజలందరూ ఘనంగా జరుపుకున్నారు.